![]() |
![]() |
యాంకర్ రవి గురించి బుల్లితెర మీద తెలియని వాళ్లంటూ ఎవరూ లేరు. అలాంటి రవి కొన్ని చిట్ చాట్ ప్రశ్నలను ఆన్సర్స్ ఇచ్చాడు. ఐతే రవి తాను ఆర్మీలోకి వెళ్లాలనుకున్నాడట చిన్నప్పుడు. కొంతవరకు వెళ్ళాడట కానీ ఆర్మీలోకి పూర్తి స్థాయిలో వెళ్లలేకపోయానని చెప్పాడు. అలా తిరిగొచ్చేసాడట. తిరిగి వచ్చేసాక లైఫ్ ఇంకా బాగుందట. యాంకరింగ్, ఇండస్ట్రీ అంతా కూడా చాలా బాగుందట. కానీ ఎందుకో ఆ రోజు ఆర్మీలోకి వెళ్లి ఉంటే ఈ పాటికి నా దేశానికి సేవ చేస్తూ ఉండేవాడట. అదొక్క బాధా తనలో ఉండిపోయిందట. తన లోపల పేట్రియాటిక్ రవి ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని కానీ ఆ విషయం చాలామందికి తెలియదని చెప్పాడు. ఈమధ్య షోస్ కి దూరంగా ఉండడానికి కారణం మూవీస్, వెబ్ సిరీస్ వైపు వెళ్ళడానికి ఇంటరెస్ట్ ఉంది. కానీ అంతా ఈజీ కాదు. చాల స్ట్రగుల్స్ ఉంటాయి అందులో. పిల్లికి తలలా ఉండాలా, పులికి తోకలా ఉండాలా అనే సందేహం. అంటే టీవీ సబ్జెక్టు తెలిసిందే ఇన్ని రోజులూ కష్టపడ్డాను...ఐతే ఇందులోంచి బయటకు వెళదామని ఉంది. కానీ పులి లాంటి సినిమాలో హీరో కావడం ఎస్టాబ్లిష్ అవడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు తాను ఆ స్ట్రగుల్ పీరియడ్ లో ఉన్నట్లు చెప్పాడు. ఇక కొంతమంది ఫ్రెండ్స్ తో కలిస్తే రచ్చరచ్చే అంటూ తన ఫ్రెండ్ గ్యాంగ్ లో ఉన్నది ఎవరో చెప్పాడు. అలీ రెజా, అష్షు రెడ్డి, ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ప్రదీప్, ముక్కు అవినాష్ ఇక అందరం కలిస్తే రచ్చ రచ్చే అని చెప్పాడు రవి. కొరియోగ్రాఫర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చాను కానీ ఇక్కడ కాంపిటీషన్ ని తక్కుకోలేకపోయాను. తర్వాత నాగార్జున గారి కారణంగా బుల్లితెర మీద సెటిల్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు రవి.
![]() |
![]() |